దేశంలో కొత్త‌గా 13,058 క‌రోనా కేసులు..

191
corona
- Advertisement -

భారత్‌లో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోంది.దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 13,058 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.. కొత్త కేసులు 231 రోజుల క‌నిష్ఠ స్థాయిలో న‌మోద‌య్యాయ‌ని వివ‌రించింది. నిన్న‌ 19,470 మంది క‌రోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. ఇక నిన్న క‌రోనాతో 164 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,52,454కు చేరింది. మొత్తం కేసుల సంఖ్య‌ 3,40,94,373కు పెరిగింది. ప్ర‌స్తుతం 1,83,118 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స పొందుతున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,34,58,801 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. దేశంలో మొత్తం 98,67,69,411 వ్యాక్సిన్ డోసులు వినియోగించారు. రిక‌వ‌రీ రేటు 98.14 శాతం ఉంద‌ని, మార్చి 2020 త‌ర్వాత ఇదే అత్య‌ధిక‌మ‌ని ప్ర‌భుత్వం చెప్పింది. వీక్లీ పాజిటివ్ రేటు 1.36 శాతంగా ఉంది. గ‌డిచిన 50 రోజుల నుంచి డెయిలీ పాజిటివ్ రేటు 3 శాతం క‌న్నా త‌క్కువ‌గా ఉన్న‌ది.

- Advertisement -