- Advertisement -
ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాది పార్టీ చీఫ్, కేంద్ర మాజీ రక్షణ మంత్రి ములాయం సింగ్ యాదవ్ సోమవారం ఉదయం మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో మూడు రోజులు పాటు సంతాపదినాలు ప్రకటటించారు. ములాయం మృతి పట్ల రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి అధికార లాంఛనాలతో ములాయం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫోన్‌లో మాట్లాడారు. రేపు జరగబోయే ములాయం అంత్యక్రియల్లో యోగి పాల్గొంటారని తెలిపారు. సామాజిక సిద్ధాంతం కోసం ములాయం తుది వరకు పోరాటం చేశారని సీఎం యోగి ఓ ప్రకటనలో తెలిపారు. యూపీ స్పీకర్ సతీశ్ మహానా కూడా ములాయం మృతి పట్ల సంతాపం తెలిపారు.
- Advertisement -