ఉత్తమ్‌ సంచలన నిర్ణయం!

382
uttam-kumar-reddy
- Advertisement -

తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్‌గా వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓటమిపాలైనా ఆయన మాత్రం తన పదవికి రాజీనామా చేయలేదు. కానీ ప్రస్తుతం వెలువడిన పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. కొన్నిజిల్లాల్లో కనీసం జడ్పీటీసీ ఖాతా కూడా తెరవలేకపోయింది.

ఈ నేపథ్యంలో నిరాశ చెందిన ఉత్తమ్‌ పీసీసీ చీఫ్‌గా వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హైకమాండ్ సైతం ఉత్తమ్‌ను మార్చేందుకు రంగం సిద్ధం చేస్తుండటంతో ఇంకా పదవిలో ఉండటం సరికాదని ఆయన భావిస్తున్నారట. ఉత్తమ్ రాజీనామా తర్వాత ఆయన స్ధానంలో కొత్త పీసీసీ చీఫ్‌గా ఎవరిని నియమిస్తారనే దానిపై కాంగ్రెస్‌లో జోరుగా చర్చనడుస్తోంది. పీసీసీ రేసులో కోమటిరెడ్డి బ్రదర్స్‌తో పాటు దుద్దిళ్ల శ్రీధర్ బాబు మరికొంతమంది సీనియర్ నేతలు ఉన్నారు.

నాలుగు సంవత్సరాల నుంచి ఉత్తమ్ టీపీసీసీ చీఫ్‌గా కొనసాగుతున్నారు. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో కూడా ఉత్తమ్ హుజూర్ నగర్ నుంచి గెలుపొందారు. ఎమ్మెల్యే పదవికి ఉత్తమ్ రాజీనామా చేసే అవకాశముంది. ఆ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో ఆయన భార్య అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి

- Advertisement -