మన్మధుడితో రోమాన్స్ చేస్తున్న మహానటి

269
manmadhudu2
- Advertisement -

కింగ్ నాగార్జున తాజాగా నటిస్తున్న చిత్రం మన్మధుడు2. మన్మధుడు సినిమాకు ఇది సిక్వెల్ గా తెరకెక్కుతుంది. ఈసినిమాకు ప్రముఖ హీరో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈసినిమాలో నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. అన్నపూర్ణ బ్యానర్ పై నాగార్జున ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ఎక్స్ 100 ఫేమ్ చైతన్య‌ భరద్వాజ్ మ‌న్మ‌థుడు 2 చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఈచిత్రంలో నాగార్జున కోడలు అక్కినేని సమంత ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. పోర్చుగ‌ల్ షెడ్యూల్‌లో స‌మంత‌తో పాటు చిత్రం ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌పై స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. తాజాగా పోర్చుగ‌ల్‌లోనే షూటింగ్ జ‌రుగుతుండ‌గా, మ‌హాన‌టి చిత్రంతో అల‌రించిన కీర్తి సురేష్ టీంతో జాయిన్ అయింది.

త్వరలోనే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేయనున్నారు. ఇక రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన చిలసౌ సినిమా మంచి విజయం సాధించింది. అక్కినేని సుశాంత్ ఈసినిమాలో హీరోగా నిర్మించారు. ఈసినిమా హిట్ అవుతుందనే గట్టి నమ్మకంతో ఉన్నాడు హీరో నాగార్జున.

- Advertisement -