కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన ఉత్తమ్..

15
Uttam

కౌశిక్ రెడ్డి చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. బెంగుళూర్ జిందాల్ నేచర్ క్యూర్ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్‌లో 2018లో హుజురాబాద్ టికెట్ రావడం వల్లనే కౌశిక్ రెడ్డి లీడర్ అయ్యాడు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే పార్టీని పార్టీలోని నాయకులను విమర్శించడం సిగ్గుచేటు అన్నారు.

కాంగ్రెస్ నాయకులపై పీసీసీ అధ్యక్షులు, రేవంత్ రెడ్డి, మణిక్కం ఠాగూర్‌లపై కౌశిక్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాను అని ఉత్తమ్ అన్నారు. ఇవి టిఆర్ఎస్ నాయకులు చేయిస్తున్న ఆరోపణలు..కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించాం..ఎవరైనా నాయకులు వారి స్థాయి తెలుసుకొని మాట్లాడాలి. కౌశిక్ రెడ్డి స్థాయి మరిచిపోయి ఇష్టానుసారంగా మాట్లాడారు. టిఆర్ఎస్ నాయకులను ప్రసన్నం చేసుకోవడానికి కౌశిక్ అలా మాట్లాడారని స్పష్టంగా తెలుస్తుంది అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.