రైతులు సన్నవడ్ల సాగును పెంచాలి- మంత్రి

170
- Advertisement -

హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో జరిగిన వ్యవసాయ శాఖ సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, తెలంగాణ విత్తనాభివృధ్ది సంస్థ ఎండీ కేశవులు, అగ్రోస్ ఎండీ రాములు, వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ విజయ్ కుమార్ హాజరైయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దొడ్డొడ్ల వినియోగం తగ్గింది..దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలలో వినియోగం తగ్గింది. అందుకే ఎఫ్‌సీఐ కొనుగోలు తగ్గించిందన్నారు. రైతులు సన్నరకాలనే అధికంగా సాగుచేయాలి. మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలనే రైతులు సాగు చేయాలని సూచించారు. దొడ్డు బియ్యాన్ని వినియోగించే తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాలు అక్కడే సాగును పెంచుకుంటున్నాయి. మార్కెట్ పరిస్థితిని గమనించి తెలంగాణ ప్రభుత్వం కొన్నాళ్లుగా సన్న వడ్ల సాగును పెంచాలని విజ్ఞప్తి చేస్తుంది.. రైతులు దీనిని గమనించి సన్నవడ్ల సాగును పెంచాలి అన్నారు.

అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు సన్నవడ్ల సాగు పెంచే దిశగా రైతులను చైతన్యపరచాలని మంత్రి ఆదేశించారు. రైతులు పప్పు ధాన్యాలు, పత్తి, నూనెగింజల సాగుపై దృష్టి సారించాలి. ఆయిల్ పామ్ సాగుతో పాటు, ఆలుగడ్డ సాగు, ఆలుగడ్డ సీడ్ విత్తనానికి ఉపయోగపడే సాగును అధికారులు పరిశీలించి రైతులను ప్రోత్సహించాలి. పట్టణ పరిసర ప్రాంతాలలో ఉన్న రైతాంగం కూరగాయల సాగును చేపట్టాలి. గత వేసవిలో టమాటా దాదాపు 6 వేల ఎకరాలలో షేడ్ నెట్‌లో సాగు చేయడం మూలంగా రాష్ట్రంలో మార్కెట్ ధరలు అదుపులో ఉన్నాయి.. రైతులు ప్రభుత్వ సూచనను పాటించి సాగు చేయడం అభినందనీయం అన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం క్షేత్రస్థాయిలో అన్ని రకాలు ఎరువుల నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయి. మోతాదుకు మించి రైతులు రసాయన ఎరువులు వాడొద్దని కోరారు. గత అనుభవాల దృష్ట్యా,జులై, ఆగస్టులలో ఉండే ఎరువుల వినియోగం దృష్ట్యా కొత్తగా కేంద్రంలో బాధ్యతలు చేపట్టిన ఎరువులు, రసాయనాల శాఖా మంత్రిని కలవనున్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు.

- Advertisement -