ఓటిటిలోకి నాగ్ ఎంట్రీ..!

49
nag

కింగ్‌ నాగార్జున టాలీవుడ్‌లో ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. కెరీర్ మొదట్నుంచి కూడా సాహసమే ఈయన ఊపిరి దూసుకుపోతున్నారు. కొత్తదనాన్ని ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందే ఉంటాడు నాగ్‌. అందుకే ఈయన పరిచయం చేసినంత మంది దర్శకులకు మరే హీరో కూడా ఈ తరంలో పరిచయం చేయలేదు. 30 మందికి పైగా దర్శకులకు లైఫ్ ఇచ్చాడు మన్మథుడు. ఎప్పుడూ ఏదో ఓ కొత్తదనం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు నాగార్జున. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు.

తాజాగా అక్కినేని నాగార్జున ఓటీటీ వైపు దృష్టి పెడుతున్నట్టు సమాచారం. త్వరలో ఓటీటీ కోసం ఆయన ప్రత్యేకంగా ఓ సినిమాని నిర్మిస్తున్నారట. ఇందుకోసం కథ కూడా ఇప్పటికే సిద్ధమైందని అంటున్నారు. అయితే, ఇందులో ఆయన నటిస్తారా? లేదా? అన్నది ఇంకా తెలియరాలేదు. అలాగే, ఓటీటీ ప్లేయర్స్ కోసం మరికొన్ని ప్రాజక్టులు కూడా ఆయన చేబడుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుంచితే, ప్రస్తుతం ఆయన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ చిత్రాన్ని, కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘బంగార్రాజు’ చిత్రాన్ని చేస్తున్నారు.