ఇరాన్-ఇజ్రాయెల్ వార్..బంగారం భగభగ!

14
- Advertisement -

బంగారం పై ఇరాన్, ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ పడింది. రోజు రోజకు దేశీయంగా భగ్గుమంటున్నాయి బంగారం ధరలు. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.లక్ష 3వేలకు చేరింది. పసిడి కొనుగోళ్లపై మొగ్గుచూపుతున్నారు ఇన్వెస్టర్లు.

కేజీ వెండి ధర రూ. 1,06,748గా ఉంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను పెంచిన విషయం తెలిసిందే. దీని ప్రభావం బులియన్ మార్కెట్ పై పడింది. స్టాక్ మార్కెట్‌లు తీవ్రంగా పతనమయ్యాయి.

ఇరాన్ అణు బాంబు పదార్థాల ఉత్పత్తిని ఆపడానికి ఓ వైపు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్ లోని కీలకమైన అణు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడులు ప్రారంభించింది. ఈ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై పడింది.

Also Read:కమల్‌పై మరోసారి హైకోర్టు తీవ్ర ఆగ్రహం

- Advertisement -