సీఎం రేవంత్‌ రెడ్డిపై కేసు ఏది?

14
- Advertisement -

నేను 28-01-2025 నాడు ఫార్ములా-ఇ కేసులో సీయం రేవంత్ రెడ్డి వల్ల రాష్ట్రానికి రావలసిన వేలాది కోట్ల రూపాయల ఆదాయానికి గండి పడిందని నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను కానీ ఇంత వరకు ఆయన మీద FIR నమోదు కాలేదు సరికదా కనీసం పోలీసులు ఫిర్యాదుదారు నైన నన్ను విచారించకుండానే కేసు క్లోజ్ చేశారు అని మండిపడ్డారు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్.

సీయం లేదా హోంమంత్రి మీద కేసు పెట్టకూడదని BNSS చట్టంలో ఎక్కడైనా ఉందా?, వుల్టా …చెయ్యని నేరానికి, ఫార్ములా వ్యవహారం లో ఒక తుఫైల్ FIR నమోదు చేసి కేటీఆర్‌కు కు నోటీసుల మీద నోటీసులు పంపుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ FIR లు నమోదు చేస్తున్నారు అని దుయ్యబట్టారు.

ఇదెక్కడి న్యాయం? ,సీయంకు ఒక రూలు, సామాన్యులకు మరో రూలా? అని తెలంగాణ డీజీపీని ప్రశ్నించారు.

Also Read:ఐదు రోజులు భారీ వర్షాలు!

- Advertisement -