కశ్మీర్‌లో ఉషాప‌రిణ‌యం

16
- Advertisement -

తెలుగు సినీ రంగంలో ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన కె.విజ‌య్‌భాస్క‌ర్ మ‌ళ్లీ ఓ స‌రికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రానికి శ్రీ‌కారం చుట్టాడు. నువ్వేకావాలి, మ‌న్మ‌థుడు, మ‌ల్లీశ్వ‌రి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ఆయ‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఉషా ప‌రిణ‌యం బ్యూటిఫుల్ టైటిల్‌తో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.

ఈ చిత్రానికి ల‌వ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉప‌శీర్షిక‌. క్రాఫ్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపైకె.విజ‌య్‌భాస్క‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ చిత్రంలో విజ‌య్‌భాస్క‌ర్ త‌న‌యుడు శ్రీ‌క‌మ‌ల్ హీరోగా న‌టిస్తుండ‌గా, తాన్వీ ఆకాంక్ష అనే అచ్చ‌తెలుగ‌మ్మాయి ఈ చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం కాబోతుంది. ఇటీవ‌ల ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాట‌ను హీరో , హీరోయిన్‌పై దుబాయ్‌లో చిత్రీక‌రించారు. ప్ర‌స్తుతం రెండు పాట‌ల చిత్రీక‌ర‌ణ కోసం చిత్ర యూనిట్ కాశ్మీర్‌కు ప‌య‌న‌మైంది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియ‌జేస్తూ ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన చిత్రీక‌ర‌ణ‌తో టాకీపార్ట్ పూర్త‌యింది. ఇటీవ‌ల దుబాయ్‌లో ఓ పాట‌ను చిత్రీక‌రించాం. ప్ర‌స్తుతం మ‌రో రెండు పాట‌ల చిత్రీక‌ర‌ణ కోసం కాశ్మీర్ వెళుతున్నాం. యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం త‌ప్ప‌కుండా అన్ని వ‌ర్గాల వారిని అల‌రిస్తుంద‌నే న‌మ్మ‌కం వుంది అన్నారు.

Also Read:ఇందిరమ్మ ఇల్లు.. ఇదేం ఫిటింగూ?

- Advertisement -