వెరికోవైన్స్ ను తగ్గించే ‘వజ్రాసనం’!

69
- Advertisement -

నేటి రోజులలో చాలమందిని వేధించే ఆరోగ్య సమస్యలలో వెరికో వైన్స్ కూడా ఒకటి. సిరలలోని చెడు రక్తం ఉబ్బిపోవడం వల్ల వెరికో వైన్స్ ఏర్పడతాయి. అయితే ఈ వెరికోవైన్స్ ను నివారించేందుకు చాలమంది ఆపరేషన్ లేదా ఇతరత్రా ట్రీట్మెంట్ వాడుతూ ఉంటారు. అయితే కేవలం వైద్యం ద్వారా మాత్రమే కాకుండా యోగా ద్వారా కూడా ఈ వెరికోవైన్స్ కు చెక్ పెట్టవచ్చు. యోగాలో వజ్రాసనం ద్వారా ఈ సమస్యకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. అయితే ఈ వజ్రాసనం ద్వారా ఇంకా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఈ వజ్రాసనంలో మోకాళ్ళ మీద కూర్చోవడం వల్ల వెన్నెముక మరియు కాళ్ళకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అంతే కాకుండా జాయింట్ మరియు మజిల్స్ కు విశ్రాంతి లభిస్తుంది. పొత్తి కడుపు, పొట్ట, ప్రేగుల మీద కూడా ఈ వజ్రాసనం ఎంతో ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. అందువల్ల మలబద్దకం వంటి ఏవైనా ఉదర సమస్యలు ఉన్న ఈ ఆసనం ద్వారా విముక్తి లభిస్తుంది.

వజ్రాసనం వేయు విధానం

ముందుగా రెండు కాళ్ళు ముందుకు చాచి కూర్చోవాలి. ఆ తరువాత మోకాళ్ళ కిందకి రెండు కాళ్ళు మడిచి ఎడమ కాలి బ్రోటన వేలుపై కుడికాలి బ్రోటన వేలు వుంచి పాదాల పైభాగం నెలకు తాకేటట్లుగా చూచుకోవాలి. దాంతో రెండు పాదాల మద్య అర్ధచంద్రాకృతి ఏర్పడుతుంది. ఈ మద్య భాగంలో రెండు పాదాల మీద పిరుదులను ఆనించి కూర్చోవాలి. మోకాళ్ళ మీద చేతులు ఉంచి శిరస్సు, వెన్నెముక నిటారుగా ఉండేటట్లు చేసుకోవాలి. ఇలా వేసిన తరువాత శ్వాస క్రియ నెమ్మదిగా జరుపుతూ 15-20 నిముషాలు ఈ ఆసనం వేయాలి.

ఈ ఆసనం రోజులో ఎప్పుడైనా వేయవచ్చు.. ముఖ్యంగా భోజనం తరువాత ఈ వజ్రాసనం వేస్తే చక్కటి ఫలితాలు ఉంటాయని యోగా నిపుణులు చెబుతున్నారు.

Also Read:టీటీడీ దర్శన టికెట్ల అప్‌డేట్

 

- Advertisement -