టమోటాతో ప్రయోజనాలు..

28
- Advertisement -

1. టమోటోలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల శరీరం యొక్క వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.

2. ఎర్రని, పండిన, పచ్చి టమోటాలో A, C, K విటమిన్లు, ఫోలేట్, పొటాషియంని కలిగి ఉంటుంది.

3.టమోటాలు సహజంగా సోడియం, కొవ్వు, కొలెస్ట్రాల్, కాలరీలను తక్కువగా కలిగి ఉంటాయి.

4. టయోటోలు కోవ్వు తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. టమోటోలో ఉండె విటమిన్ బి బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది.

5. టమోటోలు మొటిమలు మచ్చలు నివారించడానికి ఒక నేచురల్ హోం రెమెడీ గా పని చేస్తుంది.

6. టమోటో గుజ్జును ముఖానికి రాసి 15-20నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం శుభ్రపడతుంది.ముఖం కాంతి వంతగా తయారవుతుంది.

7.త్రేన్పులు, కడుపు ఉబ్బరంగా ఉండటం, నోట్లో పొక్కులు రావడంలాంటివి ఉంటే టమోటా సూప్ తయారు చేసుకుని అల్లం, నల్ల ఉప్పు కలుపుకుని తాగితే ఉపశమనం పోందవచ్చు.

8. చలికాలంలో టమోటా సూప్ సేవిస్తే జలుబు సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

9. రక్తలేమితో బాధపడేవారు నిత్యం టమోటాలు తింటుంటే మంచి ఫలితం లభిస్తుంది.

10.మహిళలు రోజూ ఓ గ్లాసు టమోటా జ్యూస్‌ తీసుకుంటే రొమ్ము క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -