ఉదయాన్నే ఈ ఆసనం తప్పక వేయండి!

65
- Advertisement -

ప్రతిరోజూ యోగా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు కలుగుతాయని మనందరికి తెలుసు. అయితే కొన్ని యోగాసనాలు ఎప్పుడు పడితే అప్పుడు వేయరాదు. మరికొన్ని ఆసనాలు ఉదయం పూట వేస్తే చక్కటి ఆరోగ్య ప్రయోజనలు కలుగుతాయి. ఆవిధంగా ఉదయం పూట తప్పకుండా వేయాల్సిన ఆసనాలలో ” నటరాజ ఆసనం ” కూడా ఒకటి. శివతాండవంలో శివుడిని పోలి ఉండడం వల్ల ఈ ఆసనానికి ఆ పేరు వచ్చింది.. దీనిని ది లార్డ్ ఆఫ్ డ్యాన్స్ ఫోజ్ అని కూడా అంటారు. ఈ ఆసనం ప్రతిరోజూ వేయడం వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు దూరం అవ్వడంతో పాటు రోజంగా ఉల్లాసంగా ఉండడానికి దోహదం చేస్తుంది. మరి నటరాజఆసనం వేయు విధానం అలాగే ఈ ఆసనం యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం !

నటరాజ ఆసనం వేయు విధానం

.ముందుగా తడాసనంలో నిటారుగా నిలబడాలి. ఆ తరువాత మనసును ప్రశాంతంగా ఉంచుకొని శ్వాసక్రియ నెమ్మదిగా జరిగిస్తూ.. ఎడమపాదాన్ని ఒకవైపునకు పైకి ఎత్తి మోకాలు వరకు మడిచి పాదం పిరుదుల వైపునకు ఉండేలా ఫోటోలో చూపిన విధంగా చేయాలి. ఆ తరువాత ఎడమ చేతితో ఎడమకాలు పాదాన్ని పట్టుకొని కుడి చేతిని వీలైనంత వరకు ముందుకు చపలి. అప్పుడు శరీర బరువంతా కూడా కుడి పాదం మీద పడుతుంది. ఆ సమయంలో కుడి కాలు నిటారుగా ఉండేలా చూసుకోవాలి. కొంత సమయం తరువాత కుడికాలుతో కూడా అదే విధంగా చేయాలి. మొదట్లో ఈ ఆసనం వేయడం కాస్త కష్టంగానే అనిపిస్తుంది. అందువల్ల గోడ సహాయంతో గాని లేదా ఇతరుల సహాయంతో గాని ఈ ఆసనం వేయవచ్చు..

ఉపయోగాలు

నటరాజ ఆసనం ఉదయాన్నే వేయడం వల్ల వెన్నెముక ఫ్లెక్సిబులిటీ పెరిగి వెన్నునొప్పి సమస్యలు దూరం అవుతాయి. అంతే కాకుండా ఊపిరితిత్తులకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మలబద్దకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. కాళ్ళకు పటుత్వాన్ని పెంచుతుంది. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు ను కరిగిస్తుంది. అంతేకాకుండా ఏకాగ్రతను పెంచడంలో కూడా నటరాజఆసనం ఎంతగానో ఉపయోగ పడుతుంది.

Also Read:వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్య..

- Advertisement -