ఉసేన్ బోల్ట్‌కు కవలలు.. పేర్లు వింటే షాకౌతారు..

104
Sprinter Usain Bolt

ఆల్ టైమ్ ఒలింపిక్ గ్రేట్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్, అతని భార్య కాసి బెన్నెట్ జంటకు ఇటీవల కవల పిల్లలు జన్మించారు. ఈ మేరకు వారు సోషల్ మీడియా వేదికగా కవల పిల్లల ఫొటోను షేర్ చేశారు. అంతేకాదు పిల్లల పేర్లనూ వెల్లడించారు. అయితే, ఇప్పుడు ఆ పేర్లపైనే సోషల్ మీడియా కామెంట్లు చేస్తోంది. ‘పేర్లు భలే ఉన్నాయే’ అంటూ సెటైర్లతో పాటు శుభాభినందనలు చెబుతున్నారు నెటిజన్లు.

వీరికి థండర్ బోల్ట్, సెయింట్ లియో బోల్ట్ అని పేర్లు పెట్టినట్లు ప్రకటించారు. తమ కూతురుకూ అదే స్టైల్‌లో ఒలంపియా లైట్నింగ్ బోల్ట్ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని బోల్ట్, ఆయన భార్య కాసి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. బోల్ట్‌కు కాసి ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెబుతూ.. తమ పిల్లలకు ఓ గొప్ప తండ్రి దొరికాడంటూ ఇన్ స్టాలో కామెంట్ చేసింది.

వారు పెట్టిన పేర్లపై నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. ‘‘లైట్నింగ్, థండర్? తుపాను రావొచ్చేమో’’ అని పేర్కొంటూ ఓ నెటిజన్ కంగ్రాట్స్ చెప్పింది. లైట్నింగ్, థండర్ బాగానే ఉన్నాయి గానీ, ఆ మూడో వాడి పేరే ఉసేన్ బోల్ట్ మధ్య పేరు ‘సెయింట్ లియో’ అని పెట్టడమే బాలేదేమోనంటూ మరో నెటిజన్ పోస్ట్ పెట్టింది.

కాగా, 34 ఏళ్ల ఉసేన్ బోల్ట్ 2008, 2012, 2016 ఒలింపిక్స్ లో 8 బంగారు పతకాలను సాధించాడు. 2017లో రిటైర్మెంట్ ప్రకటించాడు. మొత్తంగా తన కెరీర్ లో ప్రధాన చాంపియన్ షిప్ లలో 23 గోల్డ్ మెడల్స్ గెలిచాడు. రిటైర్మెంట్ తర్వాత ఫుట్ బాల్ ప్రపంచంలోకి అడుగు పెట్టాలనుకున్న బోల్ట్ కు నిరాశే ఎదురైంది. అతడికి కాంట్రాక్ట్ దక్కలేదు. దీంతో 2019లో అన్ని క్రీడల నుంచి తప్పుకొంటున్నట్టు బోల్ట్ ప్రకటించాడు.