కాళోజీ హెల్త్ యూనివ‌ర్సిటీని ప్రారంభించిన సీఎం కేసీఆర్..

101
kcr
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం వరంగల్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా వ‌రంగ‌ల్ జిల్లాలో ఏర్పాటు చేసిన కాళోజీ నారాయ‌ణ‌రావు ఆరోగ్య‌, విజ్ఞాన విశ్వ‌విద్యాల‌యాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. యూనివ‌ర్సిటీ వ‌ద్ద ఏర్పాటు చేసిన కాళోజీ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన‌ సీఎం కేసీఆర్.. పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.

ఐదు ఎక‌రాల స్థ‌లంలో రూ.25 కోట్లతో ఐదు అంతస్తులతో 69 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక భవనాన్ని నిర్మించారు. ఈ భ‌వ‌నాన్ని సీఎం కేసీఆర్ ప‌రిశీలించారు. అంత‌కుముందు హ‌న్మ‌కొండ‌లోని ఏక‌శిలా పార్కులో జ‌య‌శంక‌ర్ సార్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు సీఎం కేసీఆర్.

- Advertisement -