అమెరికా నుండి భారత్‌కు వైద్య సామాగ్రి..

63
vaccin

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో భారత్‌కు సాయం చేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. ఇక అగ్రరాజ్యం అమెరికా భారత్‌కు 100 మిలియన్ల విలువైన వైద్య సామాగ్రిని ఇండియాకు పంపేందుకు సిద్ధంకాగా ఆ సామాగ్రి ఇవాళ భారత్‌కు రానుంది.

వెయ్యి ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు, ర్యాపిడ్ కిట్స్ ను ఇండియాకు పంపేందుకు అంగీకరించింది. వీటితో పాటుగా అస్త్రాజెనకా తయారీకి కావాల్సిన ముడిపదార్ధాలను కూడా ఇండియాకు పంపుతోంది అమెరికా.

దేశంలో పరిస్థితులు మరింత దుర్భరంగా మారిపోయాయి. రోజుకు రికార్డ్ స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నారు.