రాష్ట్రంలో 24 గంటల్లో 7,994 కరోనా కేసులు..

16
coronavirus

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో 7,994 పాజిటివ్ కేసులు నమోదుకాగా 58 మంది ప్రాణాలను కోల్పోయారు. ప్రస్తుతం 76,060 యాక్టివ్‌ కేసులుండగా అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 1,630 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,27,960కి చేరగా ఇప్పటి వరకు 3,49,692 మంది కోలుకున్నారు. కరోనాతో 2,208 మంది ప్రాణాలు కొల్పోయారు. మేడ్చల్‌లో 615, రంగారెడ్డిలో 558, నల్గొండలో 424, సంగారెడ్డిలో 337, నిజామాబాద్‌లో 301, సూర్యపేటలో 264, సిద్దిపేటలో 269, మహబూబ్‌నగర్‌లో 263, జగిత్యాలలో 238, ఖమ్మంలో 213, మంచిర్యాలలో 201 కొవిడ్‌ కేసులు రికార్డయ్యాయి.