టీకాల పంపిణీ.. 1.32 కోట్ల రిజిస్ట్రేషన్లు

141
cowin
- Advertisement -

మే 1 నుండి 18 సంవత్సరాల పై బడిన వారికి టీకాలు అందించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం నుండి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంకాగా గంటలోనే సైట్ క్రాష్ అయింది. మొదటి మూడు గంటల్లో నిమిషానికి 2.7 మిలియన్ల హిట్స్‌ రాగా.. 1.32 కోట్ల టెక్ట్స్‌ మెస్సేజ్‌లు విజయవంతంగా పంపినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

ఒకేసారి పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్‌కు ప్రయత్నించడంతో సాంకేతిక సమస్యలు తలెత్తాయని ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సజావుగా సాగుతోందన్నారు. కేంద్రం ప్రకటించిన ఇటీవల ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం.. రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులు 18 ఏళ్లు పైబడిన వ్యక్తుల కోసం టీకా తయారీ సంస్థల నుంచి 50 శాతం నేరుగా సేకరించుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

ఇప్పటి వరకు మొత్తం 14.71 కోట్ల రిజిస్ట్రేషన్లలో 9.33 కోట్ల మంది నేరుగా కేంద్రాలకు రాగా.. 2.82 కోట్లు ఆన్‌లైన్‌లో నమోదయ్యాయి. సుమారు 2.55 కోట్ల మంది ఆరోగ్య, ఫ్రంట్‌లైన్ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వాలు నమోదు చేశాయి. మూడో దశలో ప్రారంభమైన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయని అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -