వాషింగ్టన్ డీసీ సమీపంలో జరిగిన కాల్పుల్లో ఒక అఫ్ఘాన్ మూలాలు కలిగిన వ్యక్తి నేషనల్ గార్డ్ సభ్యుడిని హత్య చేసిన ఘటన తర్వాత, అమెరికా ఆఫ్ఘాన్ పాస్‌పోర్ట్‌పై ప్రయాణించే వారికి వీసా జారీని నిలిపివేసింది. ఆఫ్ఘాన్ పాస్‌పోర్ట్‌లతో ప్రయాణించే వ్యక్తులకు వీసా జారీని తక్షణమే నిలిపివేస్తున్నాము అని అధికారులు పేర్కొన్నారు. అమెరికా విదేశాంగ కార్యదర్సి మార్కో రూబియో “అమెరికన్ల భద్రత కంటే అత్యున్నత ప్రాధాన్యత మరొకటి లేదని” తెలిపారు.
USCIS (యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్) కూడా అన్ని ఆశ్రయం నిర్ణయాలను తాత్కాలికంగా ఆపేసింది. USCIS డైరెక్టర్ జోసెఫ్ బి. ఎడ్‌లో Xలో ఇలా పోస్ట్ చేశారు.ప్రతి విదేశీయుడు అత్యంత కఠినంగా వెట్టింగ్ చేయబడ్డాడని నిర్ధారించే వరకు అన్ని అసైలం నిర్ణయాలను నిలిపివేశాం. అమెరికన్ ప్రజల భద్రత ముఖ్యం…ఇంతకుముందే స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ఘాన్లకు సంబంధించిన అన్ని ఇమ్మిగ్రేషన్ దరఖాస్తులను భద్రతా పరిశీలనల కోసం పాజ్ చేసింది అని తెలిపారు.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ తెలిపిన వివరాల ప్రకారం, అనుమానితుడు రహ్మానుల్లా లకన్‌వాల్ – “ఆఫ్ఘానిస్తాన్ నుండి వచ్చిన క్రిమినల్ ఎలియన్” అని పేర్కొన్నారు. అతను కాల్పుల్లో గాయపడి, అనంతరం అదుపులోకి తీసుకున్నారు. దాడి తర్వాత ట్రంప్, “మూడో ప్రపంచ దేశాలన్నింటి నుంచీ వలసలను శాశ్వతంగా నిలిపివేస్తాను” అని ప్రకటించారు. అలాగే, గత బైడెన్ పరిపాలనలో జరిగిన “అక్రమ ప్రవేశాలను” రద్దు చేస్తానని, భద్రతా ప్రమాదంగా భావించే విదేశీయులను బహిష్కరిస్తానని కూడా తెలిపారు. ప్రజా భద్రతకు ముప్పు కలిగిస్తే, వలసదారుల పౌరసత్వాన్ని కూడా రద్దు చేసే చర్యలు తీసుకుంటానని చెప్పారు.
Also Read:Cyclone Ditwah:ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

