దీక్షా దివస్.. హరీష్ భారీ బైక్ ర్యాలీ

8
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకమైన దీక్షా దివస్‌ను పురస్కరించుకుని BRS ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేటలో భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. BRS నేతలు, పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ఈ ర్యాలీని ఘనంగా నిర్వహించారు.ర్యాలీ ప్రారంభానికి ముందు హరీష్ రావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి జిల్లా పార్టీ కార్యాలయం వరకు ఈ భారీ బైక్ ర్యాలీ సాగింది. మార్గమధ్యంలో ఆయన తెలంగాణ తల్లి విగ్రహానికి మరియు ఆచార్య జయశంకర్ సార్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు.

అనంతరం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద దీక్షా దివస్ స్మారక పైలాన్‌ను ఆవిష్కరించారు.చివరిగా, రంగధంపల్లి చౌరస్తాలోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి, బైక్ ర్యాలీని జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ముగించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేస్తూ ఈ కార్యక్రమం జరిగింది.

Also Read:‘అఖండ 2’..మహా శివుని శక్తి చూస్తారు!

- Advertisement -