నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ ‘దిత్వాహ్’ తుపాను ప్రస్తుతం శ్రీలంకలో తీవ్ర ప్రభావం చూపుతూ భారత్ వైపు కదిలుతోంది. శాటిలైట్ అంచనాల ప్రకారం తుపాను మళ్లీ సముద్రంలోకి చేరడంతో వేగం పెరిగింది. చెన్నైకి శనివారం రాత్రి 250 కి.మీ., ఆదివారం ఉదయం 126 కి.మీ. దూరంలో ఉండే అవకాశం ఉంది. చెన్నై తీరాన్ని తాకే అవకాశమున్నప్పటికీ, తుపాను తినుకుగా ఏపీవైపు కదిలే అవకాశాలు కూడా ఉన్నాయని IMD తెలిపింది.
తుపాను ప్రస్తుతం కార్తెకల్‌కు 220 కి.మీ., పుదుచ్చేరికి 330 కి.మీ., చెన్నైకి 430 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర–వాయవ్య దిశగా కదులుతూ 30వ తేదీ ఉదయానికి తమిళనాడు–పుదుచ్చేరి–దక్షిణ కోస్తా ఏపీ తీరం సమీపించవచ్చని అంచనా. రేపు రాత్రికి ఇది తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రాబోయే మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఈరోజు చిత్తూరు, తిరుపతి, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిచే అవకాశం ఉంది.
ఆదివారం నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీైంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. డిసెంబర్ 2 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Also Read:నియోపోలీస్ భూముల వేలం..రూ.1352 కోట్ల ఆదాయం

