అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్ నామినేషన్!

182
trump

అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరపున నామినేట్ అయ్యారు డోనాల్డ్ ట్రంప్. అపూర్వమైన మద్దతుతో గౌరవంతో ప్రజల ముందు నిలబడ్డానని….అమెరికా అధ్యక్షుడిగా ఈ నామినేషన్‌ను అంగీకరిస్తున్నానని తెలిపారు ట్రంప్.

బిడెన్ అమెరికా ప్రతిష్టతను, ఉద్యోగాలను నాశనం చేస్తాడని ఆరోపించిన ట్రంప్‌…రాబోయే నాలుగేళ్లలో అమెరికా ఉజ్వల భవిష్యత్తు పై విశ్వసంతో ఉన్నామని అన్నారు.

ఈ సంధర్భంగా ఇవాంక మాట్లాడుతూ…ట్రంప్ కోవిడ్ నివారణ కోసం తీసుకుంటున్న చర్యలపై ప్రశంసలు కురిపించారు. వాషింగ్టన్ డొనాల్డ్ ట్రంప్‌ను మార్చలేదు. డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్‌ను మార్చారు అంటూ కొనియాడారు.నవంబర్‌లో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనుండగా రెండోసారి రిపబ్లికన్ పార్టీ తరపున నామినేట్ అయ్యారు ట్రంప్.