దేశంలో 34 లక్షలకు చేరువలో కరోనా కేసులు…

161
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. రోజుకు 75 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండటంతో కరోనా కేసుల సంఖ్య 34 లక్షలకు చేరువయ్యాయి.

గ‌త 24 గంట‌ల్లో రికార్డు స్థాయిలో 77,266 కరోనా కేసులు నమోదుకాగా 1057 మంది మ‌ర‌ణించారు. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన క‌రోనా కేసుల సంఖ్య 33,87,501కు చేరగా 61,529 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు.

ప్రస్తుతం దేశంలో 7,42,023 యాక్టివ్ కేసులుండగా 25,83,948 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. దేశంలో కరోనా టెస్టుల సంఖ్య 4 కోట్లకు చేరువయ్యాయి.