కృతి నటనకు చిరు ఫిదా…!

25
chiru

కృతి శెట్టి…ఇప్పుడు ఈపేరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉప్పెన సినిమాతో యూత్ కలలరాణిగా మారిన కృతి…తొలి సినిమాతోనే హిట్ కొట్టింది. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో కృతి ఫోటోలను షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుతున్నారు నెటిజన్లు.

తాజాగా కృతి నటనకు ఫిదా అయిన చిరు మెగా గిఫ్ట్ పంపారు. పువ్వు పుట్ట‌గానే ప‌రిమ‌ళిస్తుంది అన్న దానికి నువ్వొక ఉదాహ‌ర‌ణ‌. స్టార్ కావ‌డం కోస‌మే నువ్వు పుట్టావు. భాష తెలియ‌క‌పోయిన‌ప్ప‌టికీ , పాత్ర‌లో అద్భుతంగా జీవించావు. బేబ‌మ్మ పాత్రను తెలుగు ప్రేక్ష‌కులు ఎప్ప‌టికీ గుర్తు పెట్టుకుంటారు. మంచి విజ‌యాల‌ను సాధించ‌కుంటూ ఇలానే ముందుకు సాగిపో అని లేఖలో పేర్కొన్నారు చిరంజీవి.

చిరు ప్రశంసలతో ఉబ్బితబ్బైపోయింది కృతి. చిరు లేఖను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ….చిరు స‌ర్ థ్యాంక్యూ.. మీ మాట‌లు నా హృద‌యాన్ని తాకాయి. మీరు పంపిన గిఫ్ట్‌, మీ మాట‌లు ఎప్ప‌టికీ నా హృద‌యంలో నిలిచిపోతాయని పేర్కొన్నారు కృతి.