ఇరాన్‌కు సమీపంలో యుఎస్ యుద్ధనౌకలు!

11
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ, యుద్ధం పూర్తిగా ముగియలేదు. ప్రస్తుతం పరిస్థితి “మధ్య దశ”లో ఉన్నట్టు భావిస్తున్నారు.

అమెరికా సైన్యం తదుపరి దశ కోసం భారీ నౌకాదళాన్ని సిద్ధంగా ఉంచింది. మూడు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు మరియు ఒక భారీ అంబిఫిబియస్ దాడి నౌకతో కూడిన ఈ సైనిక సమూహం, సెంట్రల్ కమాండ్ ఆదేశాల కోసం వేచి ఉంది.

ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో ఉన్న అమెరికా నౌకాదళ స్థితి ఇలా ఉంది:

USS Gerald R. Ford — మెడిటరేనియన్ సముద్రంలో ఉంది
USS George H. W. Bush — జిబ్రాల్టర్ తీరంలో ఉంది
USS Abraham Lincoln — అరేబియా సముద్రంలోని ఒమాన్ గల్ఫ్ సమీపంలో ఉంది
USS Tripoli మరియు USS New Orleans — దక్షిణ భారత మహాసముద్ర ప్రాంతంలో సుమారు 4,000 మెరైన్లతో సిద్ధంగా ఉన్నాయి

ట్రంప్ ప్రభుత్వం ఏప్రిల్ 6 వరకు ఇరాన్‌పై దాడులను వాయిదా వేసి, చర్చలకు ప్రాధాన్యత ఇచ్చింది. అయితే ఈ విరామం కేవలం వ్యూహాత్మక చర్యగా భావిస్తున్నారు తదుపరి దశలో పెద్ద సైనిక చర్యకు అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా, అమెరికా భారీ నౌకాదళాన్ని ముందుగానే సమీకరించడం ద్వారా అవసరమైతే తక్షణమే యుద్ధ చర్యలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.

Also Read:ఇరాన్‌పై దాడులు..ట్రంప్ భిన్న కామెంట్స్

- Advertisement -