అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌పై దాడులకు ఇచ్చిన గడువును పొడిగించినట్లు ప్రకటించారు. ఇరాన్ కోరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇరాన్ తమపై దాడులను వాయిదా వేయాలని కోరిందని ట్రంప్ తెలిపారు.
అయితే ఈ విషయంపై భిన్న సమాచారం కూడా వెలుగులోకి వచ్చింది. మధ్యవర్తుల సమాచారం ప్రకారం, ఇరాన్ వాస్తవానికి దాడులను నిలిపివేయాలని ఎలాంటి అధికారిక అభ్యర్థన చేయలేదని నివేదికలు చెబుతున్నాయి. దీంతో ట్రంప్ వ్యాఖ్యలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు నెలకొనగా, ఇరాన్ ఎనర్జీ ప్లాంట్లపై దాడులు చేయాలని అమెరికా ముందుగా హెచ్చరించింది. అయితే ఈ గడువు పొడిగింపుతో కొంత సమయం చర్చలకు లభించినట్లు భావిస్తున్నారు.
Also Read:ఎమ్మెల్యేలకు ఆటల పోటీలా?:కేటీఆర్
ట్రంప్ తెలిపిన ప్రకారం, ఇరాన్ కొంత సమయం ఇవ్వాలని కోరడంతో 7 రోజుల బదులు 10 రోజుల గడువు ఇచ్చినట్లు చెప్పారు. ఈ గడువు ఏప్రిల్ 6 వరకు కొనసాగుతుంది. ఇదే సమయంలో రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.అయితే ఇరాన్ మాత్రం అమెరికా ప్రతిపాదనలను తిరస్కరించిందని సమాచారం. ఈ పరిణామాల మధ్య యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

