గుండెను కాపాడే..గోల్డెన్ రూల్స్ !

6
- Advertisement -

సాధారణంగా చిన్నగా కనిపించే ఫ్లూ వంటి వ్యాధులు కూడా గుండెపై తీవ్రమైన ప్రభావం చూపవచ్చు.ఎందుకంటే శరీరం ఆరోగ్యంగా ఉన్నట్లు అనిపించినా, తాత్కాలిక ఇన్‌ఫెక్షన్లు గుండెపోటు ప్రమాదాన్ని పెంచవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. .

ఎందుకంటే ఫ్లూ లేదా ఇతర ఇన్‌ఫెక్షన్లు శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచి గుండెపై ఒత్తిడిని పెంచుతాయి. రక్తం గడ్డకట్టే స్వభావం పెరగడం వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అలాగే, ఇప్పటికే ఉన్న ప్లాక్ (కొవ్వు పదార్థం) అస్థిరంగా మారి ఆకస్మిక గుండె సమస్యలకు దారి తీస్తుంది.

ఈ ప్రమాదాలను తగ్గించేందుకు ఆయన మూడు ముఖ్యమైన “గోల్డెన్ రూల్స్” ..

అనారోగ్య సమయంలో బలవంతంగా వ్యాయామం చేయొద్దు – ఫ్లూ ఉన్నప్పుడు కఠినమైన వ్యాయామం చేయడం గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.

రోజూ పళ్లు శుభ్రం చేసుకోవాలి – నోటి పరిశుభ్రత చాలా ముఖ్యం. పళ్లలో ఉండే బ్యాక్టీరియా రక్తంలోకి వెళ్లి గుండె ఇన్‌ఫ్లమేషన్‌కు కారణమవుతుంది.

పూర్తి విశ్రాంతి తీసుకుని, నెమ్మదిగా కోలుకోవాలి – అనారోగ్యం తర్వాత వెంటనే సాధారణ జీవితానికి తిరిగి రావడం కాకుండా, శరీరానికి సరిపడ విశ్రాంతి ఇవ్వాలి. నెమ్మదిగా పనులు ప్రారంభించాలి.

Also Read:ఇరాన్‌పై దాడులు..ట్రంప్ భిన్న కామెంట్స్

గుండె ఆరోగ్యం అంటే కేవలం వ్యాయామం లేదా డైట్ మాత్రమే కాదని, శరీరం ఇచ్చే సంకేతాలను గమనించడం కూడా అంతే ముఖ్యం. అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకోవడం, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకపోవడం ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యల కోసం వైద్యుల సలహా తీసుకోవడం అవసరం.

- Advertisement -