- Advertisement -
కరోనా సెకండ్ వేవ్‌తో భారత్ అల్లాడుతున్న సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్‌లో భారత్‌కు ఆదుకునేందుకు ప్రపంచదేశాలు ముందుకొస్తుండగా ఇప్పటివరకు 50 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం అందించినట్లు అమెరికా అధ్యక్ష భవనమైన శ్వేతసౌధం వెల్లడించింది.
ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది వైట్ హౌస్. ఇక ముందు కూడా భారత్‌కు సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు వైట్ హౌస్ మీడియా కార్యదర్శి జెన్ సాకీ. అధ్యక్షుడు జో బైడెన్ సారథ్యంలో దక్షిణాసియా దేశాలకు మా సాయం అందించేందుకు కృషి చేస్తున్నాం అన్నారు. ఇంటిలిజెన్స్ నివేదికల ఆధారంగా భారత్‌తో పాటు, అవసరం ఉన్న ఇతర దేశాలకు తగినన్ని వ్యాక్సిన్లు పంపిణీ చేస్తాం అని తెలిపారు.
- Advertisement -