2 లక్షల 29 వేల 779 కోట్లతో ఏపీ బడ్జెట్..

69
buggana

2021-22 సంవత్సరానికి గాను ఏపీ బడ్జెట్‌ని ప్రవేశ పెట్టారు ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. మొత్తం రాష్ట్ర బడ్జెట్‌ అంచనా రూ. 2,29,779.27 కోట్లుగా అంచనా వేశారు. బీసీ ఉప ప్రణాళికకు రూ.28,237 కోట్లు, కాపు సంక్షేమానికి రూ.3,306 కోట్లు, ఈబీసీ సంక్షేమానికి రూ.5,478 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమానికి రూ.359 కోట్లు, ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.17,403 కోట్లు, ఎస్టీ సబ్‌ ప్లాన్‌కు రూ.6,131 కోట్లు బడ్జెట్‌లో వెచ్చించారు.

()రెవెన్యూ వ్యయం – రూ.లక్షా 82 వేల 196 కోట్లు
()మూలధన వ్యయం – రూ.47,582 కోట్లు
()రెవెన్యూ లోటు – రూ.5 వేల కోట్లు
()ద్రవ్యలోటు – రూ.37,029.79 కోట్లు
()జీఎస్‌డీపీలో ద్రవ్యలోటు 3.49 శాతం
()రెవెన్యూ లోటు 0.47 శాతం
()ఈబీసీ సంక్షేమానికి రూ.5,478 కోట్లు
()బ్రాహ్మణ సంక్షేమానికి రూ.359 కోట్లు
()ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.17,403 కోట్లు
()ఎస్టీ సబ్‌ ప్లాన్‌కు రూ.6,131 కోట్లు
()వ్యవసాయ పథకాలకు రూ.11,210 కోట్లు
()విద్యా పథకాలకు రూ.24,624 కోట్లు
()వైద్యం, ఆరోగ్యానికి రూ.13,830 కోట్లు
()వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుకకు రూ.17 వేల కోట్లు
()వైఎస్‌ఆర్‌ ఆసరా కోసం రూ.6,337 కోట్లు
()అమ్మఒడి పథకం కోసం రూ.6,107 కోట్లు
()వైఎస్‌ఆర్‌ చేయూత కోసం రూ.4,455 కోట్లు
()రైతు పథకాల కోసం రూ.11,210.80 కోట్లు
()జగనన్న గోరుముద్ద కోసం రూ.1200 కోట్లు
()జగనన్న విద్యాకానుకు కోసం రూ.750 కోట్లు
()ఉన్నత విద్య కోసం రూ.1973 కోట్లు
()ఆరోగ్య రంగానికి రూ.13,840.44 కోట్లు
()ఆరోగ్యశ్రీ, మందుల కొనుగోలుకు రూ.2,248.94 కోట్లు
()కోవిడ్‌పై పోరాటానికి రూ.1000 కోట్లు
()పారిశ్రామిక మౌలిక సదుపాయాలకు రూ.3,673.34 కోట్లు
()వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణకు రూ.1,556.39 కోట్లు
()వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌కు రూ.243.61 కోట్లు
()వైఎస్‌ఆర్‌ బీమాకు రూ.372.12 కోట్లు