అమెరికాకు వచ్చే ప్రయాణీకులకు గుడ్ న్యూస్!

56
us
- Advertisement -

వివిధ దేశాల నుండి అమెరికాకు వచ్చే ప్రయాణీకులకు గుడ్ న్యూస్. ఇకపై అమెరికాకు వెళ్తే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఈ నిబంధనను ఎత్తివేస్తూ బైడెన్ సర్కారు తాజాగా నిర్ణయం తీసుకుంది.

నేటి నుండే ఇది అమల్లోకి వస్తుందని వెల్లడించింది. విమానయాన సంస్థలు, ట్రావెల్ ఇండస్ట్రీ ఒత్తిడి వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సమ్మర్ సీజన్ కావడంతో ప్రయాణికులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కఠిన నిబంధనలు అమలుచేస్తే ఇబ్బందులు తలెత్తుతాయని విమానయాన సంస్థలు కోరడంతో నిబంధనలను సడలించారు. అయితే 90 రోజుల్లో ఈ నిర్ణయంపై సమీక్ష జరిపి, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మళ్లీ నిర్ణయం తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

- Advertisement -