ఉమ్రాన్ మాలిక్‌ను ఎంపిక చేయకండి!

141
ravi shastri
- Advertisement -

ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌కు మాలిక్‌ను ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే టీ20 ప్రపంచకప్‌ కోసం యువ ఆటగాళ్లను పరీక్షించాలని బీసీసీఐ భావిస్తుండగా కీలక సూచనలు చేశారు మాజీ కోచ్ రవిశాస్త్రి.

టీ20 ప్రపంచకప్‌కు మాలిక్‌ను భారత జట్టులోకి తీసుకోవద్దని తెలిపాడు. ఉమ్రాన్‌కు ఇంకా టీ20ల్లో అంత అనుభవం లేదు. ఉమ్రాన్‌ను మరింత తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. అతడిని వైట్-బాల్ క్రికెట్ కొన్నాళ్లపాటు ఆడనివ్వండని…. అదే విధంగా టెస్టులో కూడా ఉమ్రాన్‌కు అవకాశం ఇవ్వాలని…అప్పుడే అతడు ఎలా రాణిస్తాడో తెలుస్తుందన్నారు.

- Advertisement -