- Advertisement -
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇక ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 8 లక్షలు దాటింది. ఇప్పటివరకు ఆ దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 మిలియన్లకు చేరుకుంది. వ్యాక్సిన్ వేసుకోనివారిలో, వృద్ధుల్లో ఎక్కువ శాతం మరణాలు నమోదు అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం అమెరికాలో ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. రెండవ ప్రపంచ యుద్ధంతో పోలిస్తే అమెరికాలో కరోనా మరణాలు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు అంచనా వేశారు. అమెరికా తర్వాత అత్యధిక మరణాలు సంభవించిన దేశాల్లో బ్రెజిల్ ఉంది. అక్కడ 6,16,000 మంది మృతిచెందారు.
- Advertisement -