అనుతో శిరీష్..ప్రేమ కాదంట

101
anu

2019లో వచ్చిన ‘ఏబీసీడీ’ సినిమా తర్వాత అల్లు శిరీష్ చేస్తున్న చిత్రం ప్రేమ కాదంట. అల్లు శిరీష్ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరో లేటెస్ట్ పిక్ బయటకు వచ్చింది. శిరీష్‌తో కలిసి అను దిగిన సెల్ఫీ ఫోటో అందరిని ఆకట్టుకుంటోంది.

జీఎ 2 పిక్చర్స్‌ బ్యానర్‌, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్‌ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తుండగా విన్నర్ ఫేమ్ రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం అల్లు శిరీష్ తీవ్రంగా కష్టపడ్డారు. సిక్స్ ప్యాక్ బాడీ ఫోటోలు ఇప్పటికే వైరల్‌గా మారగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో శిరీష్‌, అను కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఎంతలా అంటే వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని కొంతకాలంగా పుకార్లు షికార్ చేస్తున్నాయి. అయితే ఇదంతా సినిమా కోసమేనని తెలియడంతో మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.