‘ఊరికి ఉత్త‌రాన’ మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌..

978
Uriki Uttarana Movie
- Advertisement -

ఈగిల్ ఐ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వనపర్తి వెంకటయ్య నిర్మిస్తున్న చిత్రం ‘ఊరికి ఉత్తరాన’. దిల్ రాజు సంస్థ‌తో పాటు కోన వెంక‌ట్‌, వేణు శ్రీ‌రామ్‌ల వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖలో ప‌నిచేసిన స‌తీష్ ప‌రమ‌వేద ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రంతో నరేన్ హీరో‌గా ప‌రిచ‌యం అవుతుండ‌గా, దీపాలి హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. రామరాజు, ‘మల్లేశం’ ఫేం ఆనంద చక్రపాణి, ఫణి, జగదీష్ ప్రధాన పాత్రల్లో నటించారు. వ‌రంగ‌ల్‌లో జ‌రిగిన ఒక య‌థార్థ ఘ‌ట‌న ఆధారంగా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌య్యాయి. త్వ‌ర‌లో విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తున్నారు.

నూత‌న సంవ‌త్స‌రం శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ చిత్ర బృందం పోస్ట‌ర్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ల‌ను విడుద‌ల చేసింది. పోస్ట‌ర్‌లో హీరో న‌రేన్ ఓ టేబుల్ ముందు కూర్చొని ఏదో ఆలోచిస్తున్నారు. ఆయ‌న మెడ‌లోని తాయెత్తుకు మ‌హిమ ఉన్న‌ట్లుగా దాని చుట్టూ వెలుగు క‌నిపిస్తోంది. “ప్రేమ‌కు మ‌ర‌ణం లేదు.. కానీ ప్రేమిస్తే మ‌ర‌ణ‌మే..!” అనే క్యాప్ష‌న్ ఈ సినిమా కాన్సెప్ట్ ఏమిట‌నేది తెలియ‌జేస్తోంది. మోష‌న్ పోస్ట‌ర్‌లో క‌రెంట్ రాజు అనే పాత్ర‌లో న‌రేన్ ప‌రిచ‌య‌మ‌వుతున్న‌ట్లు తెలిపారు. థీమ్ మ్యూజిక్ ఇంప్రెసివ్‌గా ఉంది. క్యాప్ష‌న్‌కు త‌గ్గ‌ట్లు చివ‌ర‌లో ర‌క్తం చిందింది. ఈ మోష‌న్ పోస్ట‌ర్.. సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు మాట్లాడుతూ, “తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎంతో మంది ప్రముఖుల వ‌ద్ద ఎన్నో సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేసిన స‌తీష్ ప‌ర‌మ‌వేద ఓ మంచి క‌థ‌తో ఊరికి ఉత్త‌రాన‌ చిత్రాన్ని అంద‌రికీ న‌చ్చేలా తెర‌కెక్కించారు. న‌రేన్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. త‌న‌కు ఇది తొలి సినిమా అయిన‌ప్ప‌టికీ ఎంతో అనుభ‌వం ఉన్న న‌టుడిలా ప‌ర్ఫార్మెన్స్ క‌న‌బ‌రిచాడు. అలాగే పెద్ద హీరోల చిత్రాల‌కు ప‌ని చేస్తోన్న భీమ్స్ సిసిరోలియో, సురేష్ బొబ్బిలి మ్యూజిక్ మా సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. త్వ‌ర‌లో మా చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ ప్ర‌ముఖుల‌ స‌మ‌క్షంలో రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం” అన్నారు.

తారాగ‌ణం:న‌రేన్‌, దీపాలి, రామ‌రాజు, ఆనంద చ‌క్ర‌పాణి, ఫ‌ణి, జ‌గ‌దీష్‌
సాంకేతిక బృందం:
సినిమాటోగ్ర‌ఫీ: శ్రీకాంత్ అరుపుల‌
ఎడిట‌ర్: కార్తీక‌ శ్రీనివాస్‌
స‌ంగీతం: భీమ్స్ సిసిరోలియో, సురేష్ బొబ్బిలి
సాహిత్యం: సురేష్ గంగుల‌, పూర్ణాచారి
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌
నిర్మాత‌లు: వ‌న‌ప‌ర్తి వెంక‌ట‌య్య‌, హుస్సేన్ నాయ‌క్‌
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: స‌తీష్ ప‌ర‌మ‌వేద‌.

- Advertisement -