విజ‌య్ సేతుప‌తి బ‌ర్త్‌డే స్పెషల్..!

251
uppena
- Advertisement -

పంజా వైష్ణ‌వ్ తేజ్‌, కృతి శెట్టి జంట‌గా సుకుమార్ రైటింగ్స్ భాగ‌స్వామ్యంతో మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న చిత్రం ‘ఉప్పెన‌’. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. త‌మిళ స్టార్ యాక్ట‌ర్ విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. నేడు (జ‌న‌వ‌రి 16) ఆయ‌న బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ చిత్ర బృందం ఒక పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్ట‌ర్‌లో కాట‌న్ ష‌ర్ట్‌, పంచె ధ‌రించిన విజ‌య్ సేతుప‌తి ఫోన్‌లో ఎవ‌రితోనో మాట్లాడుతూ క‌నిపిస్తున్నారు. ఆయ‌న మ‌రో చేతిలో న‌ల్ల క‌ళ్ల‌ద్దాలు ఉన్నాయి. ఈ మూవీలో ఆయ‌న‌ది వెరీ ప‌వ‌ర్‌ఫుల్ రోల్ అని చిత్ర బృందం తెలిపింది.

‘ఉప్పెన’ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స‌హా అన్ని ప‌నులూ పూర్త‌య్యాయి. త్వ‌ర‌లో చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.స‌ముద్రతీర ప్రాంతంలోని ఓ గ్రామంలో ఓ పేదింటి అబ్బాయికీ, ఓ సంప‌న్న కుటుంబానికి చెందిన కాలేజీ అమ్మాయికీ మ‌ధ్య ప్రేమ ఎలాంటి ప‌రిణామాల‌కు దారితీసింద‌నే పాయింట్ చుట్టూ ఈ చిత్ర‌ క‌థ న‌డుస్తుంది.

ఇటీవ‌ల హీరో పంజా వైష్ణ‌వ్ తేజ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసిన టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి సూప‌ర్బ్ రెస్పాన్స్ ల‌భించింది. వైష్ణ‌వ్ తేజ్‌, కృతి శెట్టి మ‌ధ్య కెమెస్ట్రీ అదిరిపోయింద‌నీ, వారి ప‌ర్ఫార్మెన్స్ చాలా బాగుంద‌నీ నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తున్నారు. డైరెక్ట‌ర్ టేకింగ్‌ను బాగా మెచ్చుకుంటున్నారు. ఈ టీజ‌ర్‌తో ‘ఉప్పెన‌’పై అంచ‌నాలు అనూహ్యంగా పెరిగాయి.

దేవి శ్రీప్ర‌సాద్ స్వ‌రాలు స‌మ‌కూర్చ‌గా, ఇప్ప‌టికే విడుద‌లైన‌ ‘నీ క‌న్ను నీలి స‌ముద్రం’, ‘ధ‌క్ ధ‌క్‌’, ‘రంగుల‌ద్దుకున్న’ పాట‌లు మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను బాగా అల‌రిస్తున్నాయి. త‌న మ్యూజిక్ టేస్ట్‌తో, పాట‌ల‌ను ప్రెజెంట్ చేసిన విధానంతో అంద‌రి దృష్టినీ త‌న‌వైపుకు తిప్పుకున్న ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్‌ప్లే, సంభాష‌ణ‌ల‌ను కూడా అందిస్తున్నారు.

తారాగ‌ణం:
పంజా వైష్ణ‌వ్ తేజ్‌, విజ‌య్ సేతుప‌తి, కృతి శెట్టి, సాయిచంద్‌, బ్ర‌హ్మాజీ

సాంకేతిక బృందం:
క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: బుచ్చిబాబు సానా
నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, వై. ర‌విశంక‌ర్‌
బ్యాన‌ర్స్‌: మైత్రి మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌
సీఈవో: చెర్రీ
మ్యూజిక్‌: దేవి శ్రీ‌ప్ర‌సాద్‌
సినిమాటోగ్ర‌ఫీ: షామ్‌ద‌త్ సైనుద్దీన్‌
ఎడిటింగ్‌: న‌వీన్ నూలి
ఆర్ట్‌: మౌనిక రామ‌కృష్ణ‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌: అనిల్ వై, అశోక్ బి.
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌, మ‌ధు మ‌డూరి.

- Advertisement -