ప్రాధాన్య‌త క్ర‌మంలో అంద‌రికీ టీకాలు: కేటీఆర్

36
ramarao

ప్రాధాన్య‌త క్ర‌మంలో అంద‌రికీ టీకాలు వేస్తార‌ని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ తిలక్‌నగర్‌లో కరోనా వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన కేటీఆర్…అనంతరం మాట్లాడుతూ …రాష్ట్రంలో 140 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభమైందన్నారు.

కొవాగ్జిన్ టీకా హైద‌రాబాద్‌లో త‌యారు కావ‌డం గ‌ర్వ‌కార‌ణంగా ఉంద‌న్నారు కేటీఆర్. సుర‌క్షిత‌మైన టీకాల‌ను హైద‌రాబాద్ న‌గ‌రం ప్ర‌పంచానికి అందిస్తుంద‌ని ….. ప్ర‌పంచంలో వినియోగించే ప్ర‌తి మూడు వ్యాక్సిన్‌ల‌లో ఒక వ్యాక్సిన్ హైద‌రాబాద్ నుంచి ఉత్ప‌త్తి అయిందన్నారు. టీకాల ఉత్ప‌త్తిలో ప్ర‌పంచానికి టీకా రాజ‌ధానిగా హైద‌రాబాద్ మారింద‌న్నారు.

ప్రాధాన్య‌త క్ర‌మంలో అంద‌రికీ టీకాలు వేస్తార‌ని తెలిపిన కేటీఆర్….. తొలుత ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్‌కే టీకా ఇస్తున్నారు. ప్ర‌ధాని మోదీ సూచ‌న మేర‌కు ప్ర‌జాప్ర‌తినిధులు ప్ర‌స్తుతం టీకా తీసుకోవ‌డం లేద‌న్నారు. టీకాతో క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి ప్ర‌జ‌లంతా బ‌య‌ట‌ప‌డుతార‌ని ఆశిస్తున్నాన‌ని చెప్పారు. టీకా విష‌యంలో ఎవ‌రూ భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.