‘ఉప్పెన’ రీమేక్.. హీరో ఎవ‌రో తెలుసా..?

238
Uppena remake
- Advertisement -

వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు తెర‌కెక్కించిన చిత్రం ఉప్పెన‌. కృతి శెట్టి ఇందులో క‌థానాయిక‌గా న‌టించింది. ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. ఈ సినిమా 20 కోట్ల బిజినెస్ చేస్తే మూడు రోజుల్లోనే 28 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.. ఇప్ప‌టికీ మంచి వ‌సూళ్ళ‌తో దూసుకెళుతున్న ఈ సినిమాను త‌మిళంలో రీమేక్ చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో ఈ చిత్రంపై తమిళ సూపర్ స్టార్ విజయ్ కన్నేశాడట. తన తనయుడు సంజయ్ ను హీరోగా పరిచయం చేయాలన్న తలంపుతో గత కొంత కాలంగా విజయ్ మంచి కథ కోసం చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో ‘ఉప్పెన’ సినిమా సాధించిన విజయంతో దీనిని తమిళంలో రీమేక్ చేస్తూ, తన కుమారుడిని హీరోగా పరిచయం చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నాడట. ఇప్పటికే నిర్మాతలతో రీమేక్ హక్కుల విషయంలో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ తండ్రితో పాటు విలన్ పాత్రలో విజయ్ సేతుపతి నటించాడు. అయితే తమిళనాట ఈ సినిమాను తానే నిర్మించాలని చూస్తున్నాడు విజయ్ సేతుపతి.అంతేకాదు ఈ సినిమా తమిళ రీమేక్ రైట్స్ విజయ్ సేతుపతి సొంతం చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇందులో నటించినందుకు గానూ పారితోషికం కింద రీమేక్ రైట్స్ ఇచ్చారని తెలుస్తుంది. ఈ విషయంలో త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం వుంది.

- Advertisement -