దేశంలో కొత్త‌గా 9,121 మందికి కరోనా..

162
corona
- Advertisement -

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 9,121 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఈమేరకు కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. అదే స‌మ‌యంలో 11,805 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,25,710 కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 81 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,55,813 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,06,33,025 మంది కోలుకున్నారు. 1,36,872 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 87,20,822 మందికి వ్యాక్సిన్ వేశారు.

- Advertisement -