ప్రమోషన్స్‌లో ఉప్పెన టీం…

176
suma
- Advertisement -

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్రం ఉప్పెన‌. కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ మూవీని విడుద‌ల తేది ఖారార‌య్యింది. ఫిబ్ర‌వ‌రి 12న ఈ సినిమాని థియేట‌ర్‌ల‌లో విడుద‌ల‌చేయ‌నున్నారు మేక‌ర్స్‌.

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జీ తెలుగులో ఓ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు. ఇప్పటికే సంగీతంలో త‌న‌ అభిరుచికి, పాట‌ల‌ను ప్రెజెంట్ చేసిన విధానంతో అంద‌రి దృష్టినీ త‌న‌వైపుకు తిప్పుకున్న బుచ్చిబాబు సానా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతోపాటు క‌థ‌, స్క్రీన్‌ప్లే, సంభాష‌ణ‌ల‌ను కూడా అందిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి సూప‌ర్బ్ రెస్పాన్స్ ల‌భించింది. వైష్ణ‌వ్ తేజ్‌, కృతి శెట్టి వారి స్క్రీన్ ప్ర‌జెన్స్‌తో ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకున్నారు. ఈ టీజ‌ర్‌తో ‘ఉప్పెన‌’పై అంచ‌నాలు భారీగా పెరిగాయి.దేవి శ్రీప్ర‌సాద్ స్వ‌రాలు స‌మ‌కూర్చ‌గా ఇప్ప‌టికే విడుద‌లైన అన్ని పాట‌లు శ్రోత‌ల‌‌ను అల‌రిస్తున్నాయి. త‌మిళ స్టార్ యాక్ట‌ర్ విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

- Advertisement -