మొక్కలు నాటిన హీరోయిన్ కృతిశెట్టి..

666
uppena heroine
- Advertisement -

రాజ్య‌స‌భ స‌భ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన మూడో విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు ఉప్పెన హీరోయిన్ కృతిశెట్టి. మైత్రి మూవీస్ నిర్మాతలలో ఒకరు అయిన రవి శంక‌ర్ ఇచ్చిన ఛాలెంజ్‌ని స్వీక‌రించి మొక్క‌లు నాటారు కృతిశెట్టి.

సంతోష్ కుమార్ గారు చేప‌ట్టిన ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం సంతోషంగా ఉంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇదే విధంగా ముందుకు కొనసాగాలని అందరు కూడా భాద్యతగా మొక్కలు నాటాలి. ముఖ్యంగా నీ క‌న్ను నీలి స‌ముద్రం అనే సాంగ్‌ని ఇష్ట‌ప‌డిన ప్ర‌తి ఒక్క‌రు త‌ప్ప‌క మొక్క‌లు నాటాల‌ని కృతి శెట్టి తెలిపింది.

- Advertisement -