గుడికి ఒక జమ్మి చెట్టు-ఊరుకు ఒక జమ్మి చెట్టు అనే నినాదంతో ముందుకు కదులుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను సృష్టికర్త ఎంపీ సంతోష్ కుమార్‌కు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) మహిళ విభాగం సభ్యులు కృతజ్ఙతలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా కొనసాగుతున్న ఇంత గొప్ప కార్యక్రమంలో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఉప్పల స్వప్న. ఐవీఎఫ్ బృంద సభ్యులు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రాంగణంలో జమ్మి మొక్కలు నాటారు. ప్రతి ఊరుకి ఒక జమ్మి చెట్టు ఉండటం విజయానికి గుర్తున్నారు. తెలంగాణలోని ప్రజలందరూ కలసిమెలిసి ఐక్యంగా ఉండాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర మహిళ విభాగం అధ్యక్షురాలు చందా భాగ్యలక్ష్మి, జనరల్ సెక్రటరీ లంకెలపల్లి మంజుల, ఐవీఎఫ్ చీఫ్ అడ్వైజర్ మణిమాల, సలహాదారులు శైలజ, అనిత, ఐవీఎఫ్ మహిళ నాయకురాళ్లు, తదితరులు పాల్గొన్నారు.