- Advertisement -
హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ వద్ద తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్య తార క్రూస్ బోట్స్ ప్రారంబోత్సవంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మోహమూద్ అలీ గారు, మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్ , టూరిజం ఎం.డి బి. మనోహర్ , ఈ.డి శంకర్ రెడ్డి , టిఆర్ఎస్ నాయకులు, అధికారులు, టూరిజం సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి బోటును ప్రారంభించారు. అనంతరం బోటును పరిశీలించారు. హుస్సేన్ సాగర్ లోని బుద్ధ విగ్రహం చుట్టూ బోటులో ప్రయాణించారు.
- Advertisement -