కన్యకాపరమేశ్వరీ ఆలయంలో పూజలు చేసిన ఉప్పల శ్రీనివాస్..

26
srinivas gupta

వ‌రంగ‌ల్ జిల్లా హ‌న్మ‌కొండ‌లోని వాస‌వీ క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రీ ఆల‌యాన్ని తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ చైర్మ‌న్ ఉప్ప‌ల శ్రీ‌నివాస్ గుప్త సంద‌ర్శించారు. ఆల‌యంలో అమ్మ‌వారి కుంకుమార్చ‌న పూజ‌లో పాల్గొన్నారు. ఆల‌యానికి వ‌చ్చిన శ్రీ‌నివాస్ గుప్త‌కు ఆల‌య చైర్మ‌న్ తాటికొండ స‌త్య‌నారాయ‌ణ పూర్ణ‌కుంభంతో ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య క‌మిటీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అంచూరి శ్రీ‌నివాస్‌, పూజారులు సుబ్బ‌య్య శ‌ర్మ‌, శ్రీ‌కాంత్‌, ఉపాధ్య‌క్షులు గ‌ట్టు మ‌హేష్‌, ట్ర‌స్టీలు చొక్కార‌పు న‌ర‌స‌న్న‌, వెనిశెట్టి అశోక్ కుమార్, గుండా నాగేశ్వ‌ర్ రావు, ఆర్య‌వైశ్య మ‌హాస‌భ వ‌రంగ‌ల్ అర్బ‌న్ ఉపాధ్య‌క్షులు తొనుపునూరి వీర‌న్న‌, వైశ్య నాయ‌కులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.