27న ‘ఏప్రిల్ 28న ఏం జరిగింది’..?

28
april 28

సరికొత్త కథాంశంతో జనరంజకమైన అంశాలతో రూపొందే సినిమాలను తెలుగు ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. వైవిధ్యాన్ని ఆదరించే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా మా చిత్రానికి కూడా విజయాన్ని అందిస్తారని నమ్ముతున్నానుఅన్నారు దర్శకుడు వీర గనమాల. రంజిత్, షెర్రీ అగర్వాల్ జంటగా వీజీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఆయన స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ఏప్రిల్ 28 ఏం జరిగింది. తాజాగా రిలీజ్ డేట్‌ను ఖరారు చేస్తూ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్.

ఫిబ్రవరి 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని u/a సర్టిఫికేట్ పొందింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. నేటి తరం ప్రేక్షకులు మెచ్చే ఓ వినూత్నమైన కథతో, ఎవరూ అంచనా వేయలేని ట్విస్ట్‌లతో అనుక్షణం ఉత్కంఠగా సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఇది అని తెలిపారు.