సీఎం కేసీఆర్ అపరభగీరథుడు: ఉప్పల శ్రీనివాస్ గుప్తా

158
srinivas
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (EWS) 10 శాతం రిజర్వేషన్లు తీసుకురావడం ఎంతో సంతోషించే విషయమని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహిళలతో కలిసి.. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకొచ్చిన ఈ రిజర్వేషన్లు స్వాగతిస్తూ ఆయన నివాసం వద్ద సంబరాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు.

అనంతరం టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్బంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అపర భగీరథుడులా పాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు. కేసీఆర్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. కేసీఆర్ తీసుకొచ్చిన ఈ రిజర్వేషన్ల వల్ల రాష్ట్రంలోని ఆర్యవైశ్యులతో పాటు రెడ్డి సామాజిక వర్గం, వెలమ, క్షత్రియ, బ్రాహ్మణ, కమ్మ సామాజిక వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఈ కులాల్లో ఉన్న పేద విద్యార్థులందరికీ కాలేజీలలో సీట్లలో, ఉద్యోగాలలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ రిజర్వేషన్లు తెచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు తెలంగాణలో ఉన్న ఆర్యవైశ్యులందరి తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఐ.వి.ఎఫ్ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -