హుజూర్‌నగర్‌లో ఉప ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల ప్రచారం జోరందుకుంది. ఈ ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్ పార్టీ ముందుకు దూసుకుపోతుంది. ప్రతి గ్రామనికి వెళ్లి సైదిరెడ్డిని గెలిపించాలని పార్టీ నాయకులు ప్రజలను కోరుతున్నారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో భాగంగా గురువారం అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ప్రచారంలో పాల్గొన్నారు. హుజూర్‌నగర్ టీఆర్‌స్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైది రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన నేరేడుచర్లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వార్థం వల్ల అధికార దాహంతో హుజూర్‌నగర్‌లోలో ఉప ఎన్నికలు వచ్చాయి. హుజూర్‌నగర్‌లో సబ్భండ వర్గాల ప్రజలు టీఆర్‌ఎస్‌కు జై కొడుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసిన అంతిమ విజయం టీఆర్‌ఎస్ దే. ప్రచారానికి గ్రామాల్లోకి వెళ్తుంటే ప్రజలు గులాబీ నేతలకు బ్రహ్మరథం పడుతున్నారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంతో సీఎం కేసీఆర్ రైతు బాంధవుడుగా చరిత్రలో నిలిచారు అని శ్రీనివాస్ గుప్తా అన్నారు.