ఉప్ప‌ల ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ …

207
mp santhosh

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు ఉప్పల ఫౌండేషన్ చైర్మన్, ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్. తన సొంత నిధులతో నాగోల్ లోని 500 పేద కుటుంబాలకు బియ్యం, నూనె ,పసుపు ప్యాకెట్, కారం ప్యాకెట్ మరియు ఇతర వస్తువులు అందించారు.

ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ కరోనా ను కట్టడి చేయాలంటే స్వీయ నియంత్రణ తప్పని సరి అని అన్నారు. తప్పని సరి పరిస్తితుల్లో మాత్రమే బయటికి రావాలని సూచించారు. సమాజ సేవలో ఆర్య వైశ్య సభ్యులు ముందు ఉండడం అభినందనీయమన్నారు.

ప్రతి ఒక్కరు బయటకు వెళ్ళే టప్పుడు మాస్క్ లను తప్పని సరిగా ధరించి బయటకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఛాలెంజ్ రాష్ట్ర నాయకులు రాఘవ్ ,టీఆర్ఎస్ నాయకులు మాదారం రాము,గోరంట్ల కౌశిక్,కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.