లాక్ డౌన్ కొనసాగించేందుకే కేంద్రం మొగ్గు..?

334
india lockdown
- Advertisement -

కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 15 తర్వాత పరిస్ధితి ఏంటా అనే దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

ఇప్పటివరకు భారత్‌లో లాక్ డౌన్‌ కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. అయితే ముందు ముందు ఇదే పరిస్థితి కొనసాగాలంటే.. మన దగ్గర ఉన్న ఒకే ఒక మార్గం లాక్ డౌన్. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ సహా పలు రాష్ట్రాలు లాక్ డౌన్ కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

లాక్ డౌన్ విషయంలో రాష్ట్రాలు పట్టుబడుతుండటంతో కొనసాగించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న లాక్‌డౌన్ ఈ నెల 14వరకూ కొనసాగుతుంది. లాక్‌డౌన్ కొనసాగించబోతున్నామని కేంద్రం అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. పలు రాష్ట్ర ప్రభుత్వాలు, నిపుణులు దేశంలో అమలు చేస్తున్న లాక్ డౌన్ పొడిగించాలని కోరుతున్న నేపథ్యంలో కేంద్రం కూడా ఇదే ఆలోచనలో ఉందని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ANI వెల్లడించింది.

- Advertisement -