ఉపాధిని పథకంను నీరుగార్చారు…

44
- Advertisement -

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంజీనరేగా పథకాన్ని నిర్వీర్యం చేసి పేదల పొట్టగొట్టేందుకు ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్‌లో ఉపాధి హామీ పథకానికి కేంద్రం కేవలం రూ.60వేల కోట్లు కేటాయించిందన్న ఎమ్మెల్సీ కవిత…ఇది గత ఐదేళ్ల బడ్జెట్‌లో ఇదే అతి తక్కువ అని మండిపడ్డారు.  బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉపాధి హామీ పథకం సంఘం ప్రతినిధులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ… ఉపాధి హామీ పథకం అమలుకు కనీసం రూ.2.72లక్షల కోట్లు అవసరం ఉండగా…ప్రస్తుతం కేవలం బడ్జెట్‌లో రూ.60వేల కోట్లు కేటాయించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. గడిచిన తొమ్మిదేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించని బీజేపీ ప్రభుత్వం…ఉపాధి కార్యక్రమాలను సైతం అమలు చేయడం లేదన్నారు. 2020-21లో రూ. 1,10,000 కోట్లు, 2021-22లో రూ. 98,000 కోట్లు, 2022-23లో రూ. 89,400 కోట్లు, 2023-24లో రూ. 60,000 కోట్లు కేటాయించి, దశల వారీగా ఉపాధి హామీ పథకానికి బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఉపాధి హామీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రవీణ్, ఉపాధి హామీ పథకం జేఏసీ చైర్మన్ యలబద్రి లింగయ్య, కో చైర్మన్ వెంకట్ రామ్ రెడ్డి , విజయ్ కుమార్ , రఘు , సర్దార్ సింగ్ , అంజి రెడ్డి , సుదర్శన్ మరియు ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి…

ఎన్నికల కోసమే బడ్జెట్‌:కవిత

ఈ సారి రక్షణ బడ్జెట్‌ పెంపు…

రైతు వ్యతిరేక బడ్జెట్‌…

- Advertisement -