- Advertisement -
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగిన సంగతి తెలిసిందే. మేరఠ్ టోల్‌గేట్ వద్ద ఆర్మీ జవాన్‌పై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసింది టోల్‌గేట్ సిబ్బంది. టోల్‌గేట్ వద్ద ఆలస్యాన్ని జవాన్ కపిల్ ప్రశ్నించడంతో దాడి చేశారు.
దీంతో ఆగ్రహించిన స్థానికులు టోల్‌గేట్‌ను ధ్వంసం చేశారు. సిబ్బందిని చితకబాదారు స్థానికులు. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేయగా టోల్‌గేట్‌పై రూ.20 లక్షలు జరిమానా విధించారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
టోల్‌గేట్ నిర్వహణ భూని టోల్ ఏజెన్సీదిగా గుర్తించి కఠినచర్యలకు ఆదేశించింది NHAI. భవిష్యత్తులో ఎలాంటి బిడ్డింగ్‌లో పాల్గొనకుండా బ్లాక్ లిస్ట్‌లో పెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు.
Also Read:తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన
- Advertisement -

